వరంగల్ కు బయల్దేరిన తెలంగాణ మంత్రులు

వరంగల్ కు బయల్దేరిన తెలంగాణ మంత్రులుహైదరాబాద్ : మంత్రి నిరంజన్ సారథ్యంలోని బృందం, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు మాలోతు కవిత , ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. వీరంతా బేగంపేట విమానాశ్రయం నుండి వరంగల్, హన్మకొండ జిల్లాలో పంట నష్టం పరిశీలనకు బయల్దేరారు. సీఎం కేసీఆర్ టూర్ రద్దు కావడంతో మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని పంట నష్టంతీరును పరిశీలించనున్నారు.