ఆయుష్ మెడికల్ కోర్సుల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ జిల్లా : కాళోజి ఆరోగ్య హెల్త్ యూనివర్సిటీ యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతూ నేడు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.In లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.