ఆటో గర్ల్ కి మంత్రి కేటీఆర్ అండ

నల్లగొండ ఆటో గర్ల్ సబితకి మంత్రి కేటీఆర్ అండ
ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న సబిత
కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్ గా మారిన సబిత
సబితను ప్రగతి భవన్ పిలిపించుకొని సహాయం అందించిన కేటీఆర్ఆటో గర్ల్ కి మంత్రి కేటీఆర్ అండవరంగల్ టైమ్స్, నల్లగొండ జిల్లా: కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడిపిస్తున్న ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని ఆటో గర్ల్ సబితకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ పేదరికంలో ఉన్న తన కుటుంబ సభ్యుల కోసం ఆటో నేర్చుకొని తద్వారా ప్రతీరోజు కొన్ని డబ్బులు సంపాదిస్తున్న నల్లగొండకు చెందిన సబిత విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది.

వెంటనే ఆయన ఆమెకు అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమెకు సహాయం అందించాల్సిందిగా నల్లగొండ జిల్లా కలెక్టర్ ను కోరారు. సబిత కేవలం మగవారు మాత్రమే నడిపే ఆటోను నడిపించే పనికి పూనుకొని ధైర్యంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తీరు పట్ల మంత్రి అచ్చేరువొందారు. ఆమెను స్వయంగా కలిసి సహాయం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

హామీ ఇచ్చిన మేరకు సబితను ఈరోజు ప్రగతి భవన్ కి పిలిపించుకొని ఆమెతో సంభాషించారు. సబిత కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆమెకి ఏం కావాలో తెలుసుకున్నారు. కొన్నియేండ్ల క్రిందట తన తండ్రిని కోల్పోయింది. దీంతో తన తల్లి కొందరి ఇళ్ళల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చిందని తెలిపింది.

తల్లి కష్టాన్ని గమనించిన సబిత ..తమ పేదరికం దృష్టిలో ఉంచుకొని ఆటో డ్రైవర్ గా మారిన పరిస్థితిని కేటీఆర్ కు వివరించింది. దీంతో చలించిన మంత్రి కేటీఆర్ సబితకు 2 బీహెచ్ కే ప్రొసీడింగ్స్ తో పాటు ఆమె అడిగిన నూతన ఆటో రిక్షా ప్రొసీడింగ్స్ ని కూడా అందించారు. సబిత చదువుకుంటా అంటే ఆమెకు సహాయం అదిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ ఆమెకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.

యువ మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలుగుతారని సబిత నిరూపించిందని అన్నారు. పట్టుదల ఉంటే కష్టాలను ఎదుర్కోవడం అసాధ్యం కాదని నిరూపించిన గొప్ప ధైర్య సాహసి సబితా అని కేటీఆర్ కొనియాడారు. సబిత తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు యువతులకు ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుందన్నారు.

మంత్రి కేటీఆర్ తన ప్రయత్నాలకు అండగా నిలవడం పట్ల సబిత సంతోషం వ్యక్తం చేశారు. తనను పిలిపించుకొని తన గురించి వివరాలు అడిగి తెలుసుకొని అతను అడిగిన మేరకు కుటుంబానికి సహాయం అందించడం ఎన్నటికీ మరచిపోలేని ఆమె తెలిపింది. కేటీఆర్ గారు అందించిన సహాయం, స్ఫూర్తితో భవిష్యత్తు లో మరిన్ని మంచి లక్ష్యాలను చేరుకుంటానన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది.