మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు 

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు వరంగల్ టైమ్స్, అమరావతి : కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. ఈ నోటీసులను వాట్సాప్ లో పంపారు. మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

వివేకా హత్య కేసులో ఇంతకుముందు జనవరి 28న అవినాష్ రెడ్డిని తొలిసారిగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన కాల్ లిస్ట్ కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఆయన ఇచ్చిన సమాధానంతో ఏపీ సీఎం జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి పీఏ నవీన్ లను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేయడం సంచలనాత్మకంగా మారింది.