శ్రీ రుద్రేశ్వరుడి సన్నిధిలో చల్లా దంపతులు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయం శ్రీ రుద్రేశ్వర స్వామిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఎమ్మెల్యే చల్లా దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. శ్రీ రుద్రేశ్వరస్వామికి చల్లా ధర్మారెడ్డి -జ్యోతి దంపతులు అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే చల్లా దంపతులకు రుద్రేశ్వరుని ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందచేశారు ఆలయ అర్చకులు.
నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో సీఎం కేసీఆర్ సేవలు కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షతో ఉన్నారన్నారు. ఎమ్మేల్యే వెంట రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, తదితరులు ఉన్నారు.