పండుగ పూట విషాదం..ముగ్గురు గల్లంతు

పండుగ పూట విషాదం..ముగ్గురు గల్లంతు

వరంగల్ టైమ్స్, అమరావతి : మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈశ్వరున్ని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు వారు గోదావరి నదిలో దిగారు. ప్రమాదవశాత్తు నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారుగా గుర్తించారు.