మోడీకి రఘురామకృష్ణరాజు లేఖ..ఎందుకంటే ?

మోడీకి రఘురామకృష్ణరాజు లేఖ..ఎందుకంటే ?

మోడీకి రఘురామకృష్ణరాజు లేఖ..ఎందుకంటే ?

వరంగల్ టైమ్స్, అమరావతి : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. నిన్న చంద్రబాబు పర్యటనలో జరిగిన పరిణామాలను రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. పోలీసుల వైఖరిని ప్రత్యేకంగా వివరించారు. చంద్రబాబుకు అనేక అడ్డంకులు సృష్టించారని తెలిపారు. దీనిపై తగిన విధంగా స్పందించాలని ఆయన కోరారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న అనపర్తి సభలో పాల్గొనేందుకు వస్తుండగా, పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన బయల్దేరారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ రాత్రివేళ లైట్లు లేని పరిస్థితుల్లో ఆయన బలభద్రపురం నుంచి అనపర్తి వరకు నడిచి రావడం పార్టీ వర్గాలను ఆందోళనలో ముంచెత్తింది.