ముగిసిన చంద్రబాబునాయుడు సీఐడీ కస్టడీ
వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండ్రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు రెండ్రోజులు 12 గంటల పాటు ప్రశ్నించారు.
12 గంటల కస్టడీలో చంద్రబాబును సీఐడీ అధికారులు దాదాపు 120 ప్రశ్నలు వేసినట్లు సమాచారం. డాక్యుమెంట్లు చూపించి నిధులు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనే విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై సైతం విచారించారని తెలుస్తోంది. మరోవైపు కస్టడీ ముగిసిన నేపథ్యంలో చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబును హాజరుపరచనున్నారు. ఐతే ఈ సమయంలో చంద్రబాబును మరికొన్ని రోజులు కస్టడీ కావాలని సీఐడీ కోరే అవకాశాలున్నాయి.