గవర్నర్ తమిళిసై పై ఎమ్మెల్సీ కవిత ఫైర్  

గవర్నర్ తమిళిసై పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాన ప్రభుత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. కొవిడ్ లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని కవిత గుర్తు చేశారు.

కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నామని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు అని కవిత తన ట్వీట్ లో పేర్కొన్నారు.