మార్చి 14 వరకు రాజ్యసభ వాయిదా

వరంగల్ టైమ్స్ , న్యూఢిల్లీ : రాజ్యసభ సమావేశాలు మార్చి 14కి వాయిదా పడ్డాయి. పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. పార్లమెంటు సమావేశాలను కొవిడ్ కారణంగా రెండు విడతలుగా జరపాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి విడత పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం వంటివి జరిగాయి. వచ్చే నెల 14వ తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో ఈరోజు సభ్యులు కొంత గందరగోళం జరగడంతో రాజ్యసభను వాయిదా వేశారు. తిరిగి రాజ్యసభ వచ్చే నెల 14 వతేదీన మొదలు కానుంది. ఈరోజు సాయంత్రం లోక్ సభ జరగనుంది. లోక్ సభలో కూడా బిజినెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మార్చి14వ తేదీకి వాయిదా వేయనున్నారు. ఇక రాజ్యసభ వాయిదా పడినట్లు చైర్మన్ ప్రకటించారు.