బడ్జెట్ ట్యాబ్ తో రాష్ట్రపతి భవన్ కు నిర్మలమ్మ
వరంగల్ టైమ్స్, దిల్లీ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ట్యాబ్ తో నిర్మలమ్మ బృందం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. ప్రొటోకాల్ ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి బృందం.. బడ్జెట్ గురించి రాష్ట్రపతికి వివరించారు. అక్కడి నుంచి పార్లమెంట్ కు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.