నిలకడగా తారకరత్న ఆరోగ్యం : బాలకృష్ణ
వరంగల్ టైమ్స్, అమరావతి : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం తారకరత్న బీపీ 120/80 చూపిస్తుంది. గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయింది. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మిగతా పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తారకరత్న ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎయిర్ లిఫ్ట్ లేదా అంబులెన్స్ అని ఆలోచిస్తున్నాం. బెంగళూరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’’ అని బాలకృష్ణ తెలిపారు.