డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి అకాల మరణం 

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి అకాల మరణం

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి అకాల మరణం 

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి ఇకలేరు. కోలీవుడ్, మాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు డబ్బింగ్ సినిమాల్లో వారికి అదిరిపోయే వాయిస్ అందించిన శ్రీనివాసమూర్తి గుండెపోటుతో చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసమూర్తి కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, అజిత్, కార్తీ, విక్రమ్ తో పాటు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కు, జయరామ్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. శ్రీనివాసమూర్తి సహాయనటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన అకాల మరణం పట్ల సూర్య విచారం వ్యక్తం చేస్తూ సంతాప సదేశాన్ని ట్వీట్ చేశారు. “శ్రీనివాసమూర్తి మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన గొంతు, ఎమోషన్స్ తెలుగులో నా నటనకు ప్రాణం పోశాయి. ప్రియమైన శ్రీనివాసమూర్తిని చాలా మిస్సవుతున్నా.. త్వరగా అందరినీ విడిచివెళ్లిపోయారు” అంటూ సూర్య ట్వీట్ చేశారు.