గోదావరి జలాలతో మల్లన్నకు కేసీఆర్ అభిషేకం

గోదావరి జలాలతో మల్లన్నకు కేసీఆర్ అభిషేకం

వరంగల్ టైమ్స్, సిద్దిపేట జిల్లా: కొమురవెల్లి మల్లన్న స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. మల్లన్న ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలతో మల్లన్న స్వామి పాదాలకు అభిషేకం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ జలాలతో మల్లన్న పాదాలను కడుగుతానని గతంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఆ మాటను కేసీఆర్
నిలబెట్టుకున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే.గోదావరి జలాలతో మల్లన్నకు కేసీఆర్ అభిషేకంకోరమీసాల మల్లన్నస్వామికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.