రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌: రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు తాజాగా అనుమతించింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనుందుకే నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టికెట్ల రేట్లు పెంచుకునే అధికారం యాజమాన్యాలకు కల్పించింది. ఈ మేరకు జారీ తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

*మాస్కులు, శానిటైజర్‌ తప్పనిసరిగా వాడాలి.

*సినిమా హాళ్ల సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

*భౌతిక దూరం నిబంధనలు తప్పక పాటించాలి.

*హాల్‌లో ఏసీ టెంపరేచర్‌ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.