పోలీస్ ల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ : సిపి

పోలీస్ ల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ : సిపి

వరంగల్ అర్బన్ : ఆకస్మికంగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగాం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ జూన్ మాసంలో అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ వి.రాజు భార్య మానసకు భద్రత క్రింద మంజూరైన 4లక్షల రూపాయల చెక్కును సిపి అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ ప్రస్తుత స్థితిగతులను పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక కుమార్ గౌడ్ ను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వపరంగా అందాల్సిన బెనిఫిట్లను తక్షణమే అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అశోక్ ను కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ అదేశించారు.