రాజాసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం

రాజాసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం

హైదరాబాద్‌: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ (19) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. రాజాసింగ్‌తోపాటే ఆయన బావమరిది మనీష్ సింగ్ కుంటుంబం కూడా కలిసి ఉంటుంది. మనీష్‌ సింగ్‌ కుమారుడు రోహిత్ సింగ్ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా, రోహిత్ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. మరికాసేపట్లో రాజాసింగ్ ఇంటి నుండి శీతలమాత స్మశానం వరకు అంతిమయాత్ర సాగనుందని బీజేపీ నేతలు తెలిపారు.