భాజపాలోకి చేరికలు పెరిగాయి: బాబుమోహన్‌

భాజపాలోకి చేరికలు పెరిగాయి: బాబుమోహన్‌తిరుమల: దుబ్బాక విజయం స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేత బాబూమోహన్‌ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో భాజపా గెలవడం కేసీఆర్‌ని ఓడించినట్టేనని వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభదర్శనం సమయంలో బాబూమోహన్‌ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… భాజపాలోకి నాయకుల చేరికలు పెరిగాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపానే అధికారంలోకి వస్తుందన్నారు.

శ్రీవారి సేవలో పెద్దిరెడ్డి
తిరుమల శ్రీవారిని ఈఉదయం ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. తితిదే అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.