గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి కంగనా రనౌత్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి కంగనా రనౌత్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి కంగనా రనౌత్వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శంషాబాద్‌లోని పంచవటి పార్కులో కంగనా రనౌత్ మొక్కలు నాటింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ఆమె అన్నారు. తాను స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.

అందరూ ఈ ఛాలెంజ్‌ని అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె కోరారు. అనంతరం రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్, అంజలీ చౌహాన్‌ ముగ్గురికి కంగనా ఛాలెంజ్ విసిరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు.