తమిళనటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత
వరంగల్ టైమ్స్ , చెన్నై : తమిళనటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీనియర్ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు తమిళ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాలు, తెలుగు చిత్రాలలో నటించడంతో తెలుగు వారికి కూడా సుపరిచితుడు. చంద్రముఖి, శక్తి, డార్లింగ్, చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రభు ప్రస్తుతం ఇటు తెలుగు సినిమాలో అటు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభు ఇక తాజాగా విడుదలైన వారసుడు చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభు మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే ప్రభుని చెన్నైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుకి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన దగ్గర బంధువులు చెబుతున్నారు. ఆయన హాస్పిటల్లో చేరారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.