భారత్ లో ఆన్లైన్ రుణయాప్ లపై గూగుల్ కొరడా

భారత్ లో ఆన్లైన్ రుణయాప్ లపై గూగుల్ కొరడా

భారత్ లో ఆన్లైన్ రుణయాప్ లపై గూగుల్ కొరడా

వరంగల్ టైమ్స్,హైదరాబాద్: ఆన్ లైన్ రుణయాప్ లపై గూగుల్ కొరడా ఝుళిపించింది.2022లో పాలసీ నిబంధనలు అతిక్రమించిన 3,500లకు పైగా రుణయాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.ప్రపంచ వ్యాప్తంగా రుణయాప్ లు 2022లో 2బిలియన్ డాలర్ల మోసపూరిత లావాదేవీలు జరిపినట్లు గూగుల్ పేర్కొన్నది. భారత్ లో ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న వేలాది రుణయాప్ లను గుర్తించి ప్లేస్టోర్ నుంచి తొలగించామని వివరించింది.ఇలాంటి విషయాల్లో గూగుల్ ఎల్లప్పుడూ తమ పాలసీలు,సమీక్షలను క్రమం తప్పకుండా అప్ డేట్ చేస్తుందని పేర్కొంది.2023లో ప్రకటనలకు మరింత గోప్యత అనుకూల విధానం అవలంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ లో ప్రైవసీ శాండ్ బాక్స్ బీటా వర్షన్ ను కొన్ని ఆండ్రాయిడ్ డివైజెస్ లో గూగుల్ అందుబాటులోకి తేనుంది.దీని వల్ల యూజర్ ప్రైవసీ పెరగడంతో పాటు డిజిటల్ వ్యాపారాలు చేసేందుకు దోహదం చేస్తుందని గూగుల్ వెల్లడించింది.