బంగ్లాదేశ్ పై న్యూజీలాండ్ విక్టరీ

బంగ్లాదేశ్ పై న్యూజీలాండ్ విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. భారీ వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఫర్జానా ( 52) టాప్ స్కోరర్ గా నిలిచింది.బంగ్లాదేశ్ పై న్యూజీలాండ్ విక్టరీకివీస్ బౌలర్లలో సాథర్ వైట్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 144 రన్స్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూజీ బేట్స్ ( 79 నాటౌట్ ;8 ఫోర్లు), అమెలియా కెర్ (47) రాణించారు.