16 వరకు ఆ ఎన్నికలపై అభ్యంతరాల స్వీకరణ

16 వరకు ఆ ఎన్నికలపై అభ్యంతరాల స్వీకరణ

వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డ్ మెంబర్స్ స్థానాలకు ఎన్నికలు సజావుగా సాగేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు. మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ చాంబర్ లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓటర్స్ మార్పులు-చేర్పులు, మండల స్థాయిలో సర్పంచ్ లతో సమావేశం ఏర్పాటు చేయుట, ఈనెల 16 వరకు అభ్యంతరాలు స్వీకరణ, 21న ఫైనల్ పబ్లికేషన్ సంబంధిత విషయాలపై కలెక్టర్ బి.గోపి చర్చించారు.16 వరకు ఆ ఎన్నికలపై అభ్యంతరాల స్వీకరణజిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, గ్రామపంచాయతీ, సర్పంచులు, వార్డ్ మెంబర్స్ స్థానాలకు మొత్తం 42 వార్డులు, 5 సర్పంచులు, ఎంపీటీసీలు 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారుల సూచనలు సలహాల మేరకు ఎన్నికల నిర్వహణ ఉంటుందన్నారు. ప్రణాళిక ప్రకారం జిల్లా గ్రామపంచాయతీ అధికారుల భాగస్వామ్యంతో ముందుకు పోతున్నామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్,
జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, బీజేపీ జనరల్ సెక్రెటరీ హరి శంకర్, టీడీపీ మేనేజర్ లక్ష్మణ్ బీఎస్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.