తెలంగాణ హోంగార్డులకు గుడ్ న్యూస్

తెలంగాణ హోంగార్డులకు గుడ్ న్యూస్హైదరాబాద్ : తెలంగాణలో పనిచేస్తున్నహోంగార్డులకు ప్రభుత్వం న్యూఇయర్ కానుక అందించింది. రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డులకు పెరిగిన వేతనాలు జూన్ 2021 నుంచి అమలు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వానికి హోంగార్డులు కృతజ్ఞతలు తెలిపారు.