ఆ రెండు కాఫ్ సిరప్ లు వాడొద్దన్న డబ్ల్యూహెచ్ఓ

ఆ రెండు కాఫ్ సిరప్ లు వాడొద్దన్న డబ్ల్యూహెచ్ఓ

ఆ రెండు కాఫ్ సిరప్ లు వాడొద్దన్న డబ్ల్యూహెచ్ఓ

వరంగల్ టైమ్స్, జెనీవా : భారత్‌లో తయారైన దగ్గు మందుకు ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారుల మృతికి సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన రెండు దగ్గు మందులను ఉజ్బెకిస్థాన్‌ లోని చిన్నారులకు వాడొద్దని హెచ్చరించింది.

‘ఈ మరణాల నేపథ్యంలో భారత్‌లోని ‘మరియన్‌ బయోటెక్’ తయారు చేసిన దగ్గుమందులను చిన్నారులకు వాడకూడదని సూచిస్తున్నాం. ఆ రెండు దగ్గుమందుల పేర్లు ‘అబ్రోనాల్‌’, ‘డాక్‌-1మ్యాక్స్‌’. ప్రయోగశాలల నివేదిక ప్రకారం.. దగ్గుమందులో పరిమితికి మించి డైఇథిలిన్‌ గ్లైకాల్‌, ఇథిలిన్‌ ఉన్నాయి.

ఈ సంస్థ తయారు చేసిన మందులు నాసిరకమైనవి. నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలయ్యాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. మరియన్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన ‘డాక్‌-1 మాక్స్‌’ సిరప్‌ తాగిన పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్లు ఇటీవల ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. 21 మంది పిల్లల్లో 18 మంది చనిపోయారని ప్రకటించింది.