టీచర్ల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లోని దంపతుల బదిలీలు చేయాలని నిర్ణయించింది. సూర్యపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది.