పరకాలలో బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ పరుగులు

పరకాలలో బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ పరుగులు

పరకాలలో బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ పరుగులుగులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ యువ నాయకులు
బీఆర్ఎస్ లోకి స్వాగతించిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గంలో వరుసగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువనాయకులు బీఆర్ఎస్ వైపు పరుగులు పెడుతూ, గులాబీ తీర్థం పుచ్చుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగానే నేడు హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో సుమారు 20 మందికి పైగా కాంగ్రెస్ యువనాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దామెర మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువనాయకులను ఎమ్మెల్యే చల్లా గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

యువకులు ఉద్య‌మ‌పార్టీవైపే చూస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న యువత తమ పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చల్లా ధర్మారెడ్డి తెలిపారు. పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని యువకులకు ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని తెలిపారు. గ్రామాలల్లో బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను యువకులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ లో చేరిన వారిలో పెండ్లి సుధాకర్ రెడ్డి, పెండ్లి రాజు రెడ్డి, సుంకరి సుమన్, మైలా అనిల్, మైలా శేషు, బాబు అనిల్, కావటి కిరణ్, పెండ్లి శ్రీకాంత్, బాసు రాకేష్, సుంకరి రాజు, పిండి శంకర్, పిండి స్వామి, బాసు ప్రసాద్, బాసు సంపత్, తుత్తురు దినేష్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.