ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి కేసీఆర్‌ భూమి పూజ

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి కేసీఆర్‌ భూమి పూజన్యూఢిల్లీ : తెలంగాణ రథసారధి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. టీఆర్ఎస్ ఆవిర్భవించిన రెండు దశాబ్దాల తర్వాత కీలక ఘట్టానికి పునాది పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో ఆ పార్టీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపనలో భాగంగా మధ్యాహ్నం 1.48 గంటలకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, పలువురు తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్ , టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛరణ మధ్య భూమి పూజ నిర్వహించారు.

ఢిల్లీలోని వసంత్ విహార్ వేదఘోషతో మారుమోగింది. ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 1100 చదరపు మీటర్ల ప్రాంగణంలో తెలంగాణ భవన్ ను నిర్మించనున్నారు. త్రీ ప్లస్ త్రీ రీతిలో తెలంగాణ భవనాన్ని నిర్మించనున్నారు. గురువారం భూమిపూజ సమయంలో ముందుగా సీఎం కేసీఆర్ హోమంలో పాల్గొన్నారు. వేద వచనాలతో వసంత్ విహార్ వెల్లువిరిసింది. పండితులు మంత్రోచ్ఛరణతో శుభసందేశాలిచ్చారు. మంగళకరమైన దీవెనలతో ఆ ప్రాంగణం దివ్యవెలుగులు చిమ్మింది.