గద్దెలకు చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు

-రాత్రి 10.47నిముషాలకు గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ..
-అదే టైంలో మేడారం గద్దెలపై చేరిన పగిడిద్దరాజు, గోవిందరాజులు
-వనదేవతలను కొలిచేందుకు భక్తజనం పరవళ్లు..
-తల్లుల సన్నిధిలో మారుమ్రోగుతున్న జైగంటలు..గద్దెలకు చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులువరంగల్ టైమ్స్,ములుగు జిల్లా: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర అసలు గట్టం మొదలైంది. వనదేవతలను కోలిచెందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు బుధవారం రాత్రి 10.47 నిముషాలకు గద్దెలపైన ఆశీనులయ్యారు. గిరిజన పూజారులు, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కన్నెపల్లి నుంచి కాక వంశస్తులు సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును పెనుక వంశస్తులు తీసుకొచ్చారు. సంప్రదాయ పరంగా పూజారి కాక సారయ్య, కిరణ్, కనుకమ్మ, భుజంగరావు, వెంకటేశ్వర్లు, లక్ష్మి భాయమ్మ వీళ్లంతా దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. వీరి రాకతో జాతర లాంఛనంగా ప్రారంభమైంది.గద్దెలకు చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు