మేడారం భక్తులకి శుభవార్త

మేడారం భక్తులకి శుభవార్తహనుమకొండ జిల్లా : నేటి నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను హన్మకొండ బస్టాండ్ నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ఛార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.