వరంగల్ టైమ్స్, దంతేవాడ జిల్లా : ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు ఏరియా కమాండర్ మృతిచెందారు. దంతేవాడ జిల్లాలోని బుర్గాం అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో తప్పించుకునే క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో బుర్గాం ఏరియా మావోయిస్టు కమాండర్ లక్మ మృతి చెందారని పోలీసులు తెలిపారు. అతనిపై గతంలో రూ.5 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు.