లాభసాటి వ్యాపారాలపై అవగాహన కల్పించాలి

లాభసాటి వ్యాపారాలపై అవగాహన కల్పించాలివరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : దళిత బంధు లబ్దిదారులకు లాభసాటి వ్యాపారాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణితో కలిసి దళిత బంధు ప్రత్యేక అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్షించారు. జిల్లాలో దళిత బంధు లబ్దిదారులకు లాభసాటి వ్యాపారం కోసం ప్రత్యేక అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ ప్రస్తుతం మార్కెట్లో ఎలా ఉందో తెలుసుకొని వారికి లాభం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అందుకు అవసరమైన చర్యలను సెక్టరియల్ అధికారులు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మిగిలి ఉన్న గ్రౌండింగ్ పనులు లబ్ధిదారులు, యూనిట్ చేంజ్ తదితర పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిఆర్డిఓ.ఎ.శ్రీనివాస్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవిలత, ఆర్డిఓ వాసు చంద్ర, ఈఓ ఎస్సీ కార్పొరేషన్ డా. వెంకన్న దళిత బంధు సెక్టరియల్ అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.