ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : 2021-2022 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను టీఎస్ ఇంటర్మీడియల్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు జరుగనున్నాయి. ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమస్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 11న, ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్ 12న జరుగనుంది. ఇంటర్ ఒకేషనల్ కోర్సులకు కూడా ఇవే తేదీలలో పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే వాటి షెడ్యూల్ ను ఇంకా ఇంటర్ బోర్డు ప్రకటించలేదు.