విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ :సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.ఈ పరీక్షల్లో 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు డిజీ లాకర్, ఉమాంగ్ (DigiLocker, UMANG)యాప్‌లతో పాటు cbseresults.nic.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.పాఠశాల నెంబర్‌,అడ్మిట్‌ కార్డ్‌ ఐడీ,పుట్టిన తేదీని ఉపయోగించి ఫలితాలను చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.గత సంవత్సరంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతంలో 5.38 శాతం తగ్గింది.విద్యార్థులకు వారి స్కోర్‌ల ఆధారంగా ప్రథమ,ద్వితీయ,తృతీయ డివిజన్‌లను ప్రదానం చేసే విధానాన్ని రద్దు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ యేడాది ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపు 16.9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో తిరువనంతపురం 99.91 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, ప్రయాగ్ రాజ్ 78.05 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి.