అయ్యన్ ప్రణతికి మెగాస్టార్ అభినందనలు

అయ్యన్ ప్రణతికి మెగాస్టార్ అభినందనలు

– విశాఖ కీర్తి ద్విగుణీకృతం చేయాలని ఆశీస్సులు
– భార్య సురేఖతో ప్రణతి పాటల విందు ఆస్వాదన
– సెల్ఫీలు, ముచ్చట్లు, చలోక్తులతో సందడి

అయ్యన్ ప్రణతికి మెగాస్టార్ అభినందనలువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఇండియన్ ఐడిల్ సీజన్ 2లో విశాఖ గాయని బేబీ అయ్యన్ ప్రణతి ఫైనల్స్ విజేత కావాలని మెగా స్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.ఆహా ఓటిటి (ఆహాటివి)నిర్వహిస్తున్న పాటల పోటీలు, ఆహా ఓటిటి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కొనసాగుతుంది. ఇందులో విశాఖ శివాజీపాలెంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన అయ్యన్ ప్రణతి టాప్ 6 లో కొనసాగుతూ విజయం వైపు దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అయ్యన్ ప్రణతిని స్వయంగా అభినందించారు.

అయ్యన్ ప్రణతిని కుటుంబ సమేతంగా చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించారు.బేబీ అయ్యన్ ప్రణతి మధురగానాన్ని భార్య సమేతంగా ఆస్వాదించారు.బేబి అయ్యన్ ప్రణతిని ప్రశంసిస్తూ సత్కరించారు. అయ్యన్ ప్రణతితో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పాటలు పాడించుకున్నారు.చిరంజీవి తన భార్య సురేఖకి,ఆయన మనువరాలికి ఇంత చిన్న వయస్సులోనే అసమాన ప్రతిభ కనబరుస్తున్న తీరుని వివరించారు. అయ్యన్ ప్రణతి అన్నా, ఆమె పాటలన్నా చాలా ఇష్టమని పేర్కొన్న చిరంజీవి సతీమణి సురేఖ కూడా అయ్యన్ ప్రణతితో ముచ్చటించింది. ప్రణతి పాటలు విందుని ఆస్వాదించి సురేఖ ఆనందంతో మురిసిపోయారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ దంపతులు అయ్యన్ ప్రణతిని ఆహా ఓటిటి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో విజేతగా నిలవాలని ఆశీర్వదించారు. సామాన్యులమైన తమ పట్ల ఇంత అభిమానం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి దంపతులకు అయ్యన్ ప్రణతి తల్లిదండ్రులు ఆర్.ఉదయ కుమార్, భారతిదేవి ధన్యవాదాలు తెలిపారు. ప్రణతి పాటలకు తన్మయత్వం చెంది, తమపై ఆదరాభిమానలు, అతిథి మర్యాదలు ఇచ్చిన మెగా దంపతుల ఆశీర్వాదం, ఆతిథ్యం అద్భుతమని వారు అన్నారు. ఇదంతా మెగా దంపతుల సంస్కారానికి, వ్యక్తిత్వానికి నిదర్శనమని ప్రణతి తల్లిదండ్రులు కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.