కర్ణాటక కాంగ్రెస్ కైవసం

కర్ణాటక కాంగ్రెస్ కైవసం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ
అనుకున్నదానికంటే ఎక్కువ స్థానాల్లో గెలుపు
ప్రజలను ఆకర్షించిన ఆ ఐదు సూత్రాలు
ఫలించిన రాహుల్ భారత్ జోడో
కాంగ్రెస్ గెలుపులో ప్రియాంక గాంధీ సెంటిమెంట్
గత సమస్యలు రిపీట్ కాకుండా కాంగ్రెస్ వ్యూహం
ఊహించని విధంగా బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్
ప్రజాతీర్పుకు సంబురపడిపోయిన కాంగ్రెస్ అధిష్టానం
కర్ణాటక కైవసంతో కాంగ్రెస్ లో నూతనోత్సాహం
దేశవ్యాప్తంగా సంబురాలు
ఫలించని బీజేపీ సెంటిమెంట్లు
వచ్చే ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందన్న విశ్లేషకులు

కర్ణాటక కాంగ్రెస్ కైవసం

వరంగల్ టైమ్స్, కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది.ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగ్గా ప్రభావం చూపెట్టింది.ఆపై సంపూర్ణ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. శనివారం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ ఆధిక్యంలోనే దూసుకెళ్లింది.మొదట స్వల్ప ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్,ఆ తర్వాత ఒక్కసారిగా వేగాన్ని పెంచింది. మొత్తం 224 స్థానాలకు గాను,కాంగ్రెస్ 136 స్థానాల్లో జయకేతనం ఎగురువేసింది. ఇక బీజేపీ 65 స్థానాల్లో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక కింగ్ మేకర్ అవుతామని ప్రకటించిన జేడీఎస్ 20 స్థానాల్లో,ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 స్థానాలు దక్కించుకోగా, ఈ సారి అదనంగా 58 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. 2004 తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ కు ఈ స్థాయి మెజార్టీ రావడం ఇది రెండో సారి. ఇక బీజేపీ ఈ సారి డీలా పడింది.

కర్ణాటకలో బీజేపీ వ్యూహాలు ఫలించలేదు.ఈ సారి బీజేపీ 65 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది.అయితే ఈ సారి గతంలో గెలుపొందిన స్థానాల్లో 39 స్థానాలను బీజేపీ కోల్పోయింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో 37స్థానాల్లో గెలుపొందగా, ఈ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితమైంది.అయితే ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తేల్చడంతో జేడీఎస్ కు ప్రాధాన్యత ఏర్పడింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎవరి మద్దతు లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపోతే ఇప్పుడు కాబోయే సీఎం ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సీఎం కుర్చీ అప్పగిస్తుందా లేదా సీనియర్ నేత సిద్ధరామయ్యకు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

కర్ణాటక కాంగ్రెస్ కైవసం– ఆకర్షించిన కాంగ్రెస్ మేనిఫెస్టో: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ముందుగానే తన గెలుపుకు వ్యూహాలు రచించుకుంది.అదే తడవుగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది.కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ఎజెండాలోని అంశాలను అమలుపారుస్తామని డంకా భజాయించి చెప్పారు.మేనిఫెస్టో అంశాలు ఇవే,గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,గృహలక్ష్మి పథకం కింద 1.5 కోట్ల గృహిణులకు నెలకు రూ. 2 వేల ఆర్థిక సహాయం,అన్న భాగ్య పథకం కింద పేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం,యువనిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.3వేలు,డిప్లొమా చదివిన వారికి నెలకు రూ.1,500నిరుద్యోగభృతి, ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.

– ఫలించిన భారత్ జోడో యాత్ర : ఇక కాంగ్రెస్ పని అయిపోయింది,ప్రతిపక్షానికి కూడా పనికిరాదు అనుకునే తరుణంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశమంతా కాలినడకన చుట్టేశారు.ప్రజలని కలిశారు.అటు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు.ఇద్దరు కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులేశారు.ఈ క్రమంలోనే కర్ణాటయ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.కాంగ్రెస్ కు అగ్నిపరీక్ష మొదలైంది.2018లో ఇక్కడ కాంగ్రెస్-జేడీఎస్ కలిసి అధికారం పంచుకున్నాయి.

కానీ అధికారాన్ని కూల్చి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. అలా బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం సులువు కాదనే పరిస్థితి.ఒకవేళ మెజార్టీ సీట్లు వస్తాయోమో గానీ, మళ్లీ హంగ్ వచ్చే పరిస్థితి ఉందని కొన్ని సర్వేలు కూడా చెప్పాయి.ఈ నేపథ్యంలో బీజేపీ,జేడీఎస్ తో మంతనాలు మొదలుపెట్టింది.జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రెడీ అయ్యింది. అయినప్పటికీ హోరాహోరీగా అన్ని ఎన్నికల ప్రచారం చేశాయి.ఎవరి ప్లాన్స్ వారికి ఉన్నాయి.ఇక కన్నడ ప్రజలు తీర్పు ఇచ్చే రోజు వచ్చింది.

స్టార్టింగ్ ఫలితాలు వెలువడే విధానం చూస్తే హాంగ్ వస్తుందనే డౌట్.ఈ క్రమంలో బీజేపీ,జేడీఎస్ తో మంతనాలు చేసుకున్నట్లు కూడా కథనాలు వినిపించాయి. ఇక ఈ కథనాలని పటాపంచలు చేస్తూ 224 సీట్లు ఉన్న కన్నడ నాట కాంగ్రెస్ జెండా పాతేసింది. 136 స్థానాల్లో తన సాతాను చాటుకుని అనుకున్నదని కంటే ఎక్కువ స్థానాల్లో సీట్లు కైవసం చేసుకుని బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అటు కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చుకుంటూ,స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.