ఛత్తీస్ గఢ్ : కొద్ది సేపటి క్రితం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందారు. తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో జరిగిన ఈ ఘటన మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలోని ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
చనిపోయిన నక్సలైట్ల మృతదేహాలను పోస్ట్ మార్గం కోసం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణాకు చెందిన గ్రే హౌండ్స్ బలగాలు నక్సలైట్లతో తలపడినట్లు సమాచారం. భీకర పోరులో నక్సలైట్లకు మరింత ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎన్కౌంటర్ సంఘటనను పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.