మానసిక ఉల్లాసానికి క్రీడలు చాలా అవసరం: ఎర్రబెల్లి

మానసిక ఉల్లాసానికి క్రీడలు చాలా అవసరం: ఎర్రబెల్లివరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి అవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడోత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇక కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాలు, చారిత్రక నేపథ్యం ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంతో మంది క్రీడాకారులు కూడా కీర్తిని గడించారని, అలాంటి వారిలో అర్జున పిచ్చయ్య, వెంకటనారాయణ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను మంత్రి గుర్తు చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యం కోసం, ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.