శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ భేటీ

శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ భేటీ

వరంగల్ టైమ్స్, ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. బీజేపీ వివక్ష రాజకీయాలు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలయించడంపై వారు చర్చిస్తున్నారు. అంతకు ముందు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులు రావాల్సి అవసరం ఉందని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్, ఉద్ధవ్ నివాసంలో లంచ్ చేసిన తర్వాత దేశ రాజకీయాలు, ఇరురాష్ట్రాల మధ్య సంబంధాలపై చర్చించారు.శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ భేటీ