ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతిఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

వరంగల్ టైమ్స్, బీజాపూర్: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు చనిపోయినట్లు బస్తర్ ఐజీపీ సుందర్ రాజ్ తెలిపారు. బండిపొరా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీపీ సుందర్ రాజ్ చెప్పారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. మృతుడిని గుర్తించాల్సి ఉందన్నారు.