ఒగ్గు సట్వాజి దంప‌తుల‌ను కలిసిన మంత్రి 

ఒగ్గు సట్వాజి దంప‌తుల‌ను కలిసిన మంత్రి

ఒగ్గు సట్వాజి దంప‌తుల‌ను కలిసిన మంత్రి వరంగల్ టైమ్స్, నిర్మల్ జిల్లా : మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన ఒగ్గు సట్వాజి దంప‌తుల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసారు. ఆదివారం నిర్మల్ పట్టణం దివ్య నగర్ లోని స‌ట్వాజి ఇంటికి వెళ్ళి వారితో క‌లిసి అల్పహారం చేశారు. హింసా మార్గం వీడి జ‌న‌జీవ‌నంలోకి వ‌చ్చిన స‌ట్వాజి దంప‌తుల‌ను మంత్రి ఈ సంద‌ర్భంగా అభినందించారు. జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన తెలిపారు.