గురుకుల విద్యార్థులపై కేటీఆర్ ప్రశంసల జల్లు

గురుకుల విద్యార్థులపై కేటీఆర్ ప్రశంసల జల్లువరంగల్ టైమ్స్,హైదరాబాద్: ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల కాలేజీల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సిలింగ్ లో 190 మంది మెడికల్ సీట్లు పొందడం అభినందించ దగిన విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. గత ఆరేండ్లలో 512 మందికి పైగా విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆ శాఖ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.