దేశంలో పెరుగుతోన్న ఒమిక్రాన్, కరోనా కేసులు

దేశంలో పెరుగుతోన్న ఒమిక్రాన్, కరోనా కేసులున్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 387 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 7,286 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,037 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 4,79,520కి చేరింది. దేశంలో 141.01 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 415కి చేరింది. ఇందులో 115 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 108 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్ లో 22, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానాలో 4 కేసుల చొప్పున, జమ్మూకశ్మీర్ , బెంగాల్ లో 3 కేసుల చొప్పున, ఉత్తర ప్రదేశ్ లో 2, చండీగఢ్, లడఖ్, ఉత్తరాఖండ్ లో ఒక్కో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.