ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలుశ్రీనగర్ : జమ్మూకశ్మీర్ సోఫియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చౌగం ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ఏరియాలో రాత్రి నుంచే బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.