అమరజవానుకు వీడ్కోలు

సూర్యాపేట: దేశంకోసం ప్రాణత్యాగం చేసిన సంతోష్ బాబు అమర్ రహే అనే నినాదాలతో సూర్యాపేట హోరెత్తిపోయింది. నగరవీధుల మీదుగా కేసారం వరకు 2 గంటలపాటు ఆయన అంతిమయాత్ర జరిగింది. అమరజవానుకు వీడ్కోలుప్రజలు, కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, నేతలు, ఆర్మీ అధికారులు, జిల్లా యంత్రాంగం సమక్షంలో ఆయనకు సైనిక లాంఛనాలతో కన్నీటివీడ్కోలు ఇచ్చి జాతి నివాళులు అర్పించింది. సంతోష్ బాబు సొంత వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ జరిగిన సైనిక సంస్కారాల్లో బీహార్ రెజిమెంట్ బృందం కూడా పాల్గొంది. అమరజవానుకు వీడ్కోలు

అమరజవానుకు వీడ్కోలువీర సైనికుడు సంతోష్ బాబు అంత్యక్రియల సందర్భంలో ఆయన మూడేళ్ళ కుమారుడు చేసిన సెల్యూట్ కంటతడి పెట్టించింది. ఆయన కుటుంబసభ్యులు చేసిన వందనం దేశంపట్ల వాళ్ళ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచి, ప్రజల్లో నిజమైన దేశభక్తిస్ఫూర్తిని రగిలించింది.

అమరజవానుకు వీడ్కోలు

అమరజవానుకు వీడ్కోలు