కల్నల్‌ సంతోష్ బాబు‌ అంతిమ యాత్ర

కల్నల్‌ సంతోష్ బాబు‌ అంతిమ యాత్ర

వరంగల్ టైమ్స్, సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన స్వగృహం నుంచి కల్నల్‌‌ సంతోష్‌బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, రైతు బజార్‌, పాత బస్టాండ్‌, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.కల్నల్‌ సంతోష్ బాబు‌ అంతిమ యాత్రదారి పొడవునా వేలాది మంది ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు.