హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 214 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5675కి పెరిగింది. కరోనా నుంచి 3071 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 192 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2412గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.