సూర్యాపేటకు సంతోష్‌ పార్థివదేహం తరలింపు

హైదరాబాద్‌: భారత్‌ సరిహద్దుల్లో చైనా దురాగతానికి అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది.సూర్యాపేటకు సంతోష్‌ పార్థివదేహం తరలింపు

ఆ వీర జవాను పార్థివ దేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంతోష్‌బాబు భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌లో సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించారు. సూర్యాపేటకు సంతోష్‌ పార్థివదేహం తరలింపు

సూర్యాపేటకు సంతోష్‌ పార్థివదేహం తరలింపుతొలుత హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు కోరగా.. తాము స్వస్థలంలోనే నిర్వహించుకుంటామని ఆయన తల్లిదండ్రులు చెప్పడంతో రేపు ఉదయం 8 గంటలకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సూర్యాపేట నుంచి స్వస్థలమైన కేసారం వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే సంతోష్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి.