ఉదయభాను ఛాలెంజ్ ను స్వీకరించిన బ్రహ్మానందం

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికోండలోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ఈ ఉదయభాను ఛాలెంజ్ ను స్వీకరించిన బ్రహ్మానందం

సందర్భంగా బ్రహ్మానందం ఉదయభానుతో  మాట్లాడిన విషయాలను ఉదయభాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులకు వివరించడం జరిగింది. నీను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మానందంకు ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిని కాపాడేందుకు ఒంటికాలిపై తపస్సు చేస్తుంది ఒక్క చెట్టు మాత్రమే అని, ఇది అక్షర సత్యం ప్రకృతి పట్ల తనకు ఉన్న బాధ్యతను నాతో పంచుకున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని అందుకు సంతోష్ కి అభినందనలు తెలియజేశారు. ఆ ఫోటోలను చూస్తుంటే నేలతల్లి పై కూర్చొని తన తల్లికి సేవ చేస్తున్నట్లు కనిపిస్తుందని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది మొక్కలు నాటాలని ఆశిస్తున్నానని ఉదయభాను బ్రహ్మానందంతో చెప్పారు.