గర్భంతో ఉన్నా కరోనాపై పోరు ఆపని వీరనారీలు

విధి నిర్వహణలో వీరనారీలు.. గర్భంతో ఉన్నా కరోనాపై పోరు ఆపని మహిళా ఎస్పీలు..!!

వరంగల్: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వీరితో పాటు గర్భిణీలు కూడా ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే కరోనా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ… కొందరు మహిళా పోలీసులు మాత్రం విధుల్లో కొనసాగారు. కీలకమైన సమయంలో ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. వారిలో ఒకరు మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి కాగా, మరొకరు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మ. ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించినప్పుడు ఎస్పీ చందనా దీప్తి పర్యటన ఏర్పాట్లలో ఉండగా ఆమె గర్భిణి అనే అంశంపై పలువురు దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గర్భంతో ఉన్నా కరోనాపై పోరు ఆపని వీరనారీలు

విధి నిర్వహణలో చందన దీప్తి..
ఈ ఒక్క కార్యక్రమం మాత్రమే కాదు… మార్చి నుంచి క్రమం తప్పకుండా విధులకు హాజరవుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు చందన దీప్తీ. ప్రతి సోమవారం ప్రజావాణిలో ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇక జగిత్యాల ఎస్పీ సింధు శర్మ కూడా గర్భవతిగా ఉంటూ కరోనా విధులు నిర్వహించటం విశేషం. ఎంతో సాదాసీదగా ఉండే ఈ అధికారిణి మొన్నటివరకు అలుపెరగకుండా కరోనా విధులు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మొత్తం లాక్‌డౌన్‌ని పటిష్ఠంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.నిన్నమొన్నటి వరకు విధుల్లో ఉన్న ఆమె… ఇటీవలే మెటర్నిటీ లీవ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.గర్భంతో ఉన్నా కరోనాపై పోరు ఆపని వీరనారీలువిధి నిర్వహణలో సింధూ శర్మ..
ఈ ఇద్దరు మహిళా పోలీసు ఉన్నతాధికారులు గర్భంతో ఉండి కూడా తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించడంపై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ఏ మాత్రం తలవంచకుండా వారి విధులను నిర్వర్తిస్తూ కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోవటం సమాజానికి ఒకింతమంచి సందేశాన్ని ఇస్తుంది. తెలంగాణ పోలీస్ శాఖకి కూడా ఇలాంటి పోలీస్ నారీమణులతో ఎనలేని ప్రతిష్టను తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి లేదు.